తీర్మానాలు
నాల్గవ మహాసభల్లో ఏడు తీర్మానాలను ఆమోదించారు. అవి: | |
1.తెలుగుభాష, సంస్కృతికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు. సాహిత్య, లలిత, సంగీత, నాటక అకాడమీల పునరుద్ధరణ. |
|
2. ఇతర రాష్ట్రాల భాషా సంస్కృతి అంశాలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, తెలుగు అధికార భాషా సంఘాన్ని కూడా ప్రత్యేక మంత్రిత్వశాఖ పరిధిలో చేర్చాలి. |
|
3. గ్రామస్థాయి నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు అధికార భాషగా తెలుగును అమలు చేయాలి. ఇందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలి. |
|
4. తెలుగు జానపద కళలు, ఇతర కళారూపాలు, సాహిత్యం, చరిత్ర తదితర అంశాలపై పరిశోధన, ప్రదర్శన, పరిరక్షణ లక్ష్యాలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి. |
|
5. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారి పిల్లలు తెలుగు నేర్చుకునేందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలను రాష్ట్రప్రభుత్వం ఉచితంగా అందించాలి. బోధనకు ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వం సమకూర్చాలి. |
|
6. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విద్యాసంస్థల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు సాంస్కృతిక విద్యను ప్రత్యక అంశంగా చేర్చి విద్యార్థికి ఇష్టమైన ఏదైనా లలిత కళను అభ్యసించేలా చేయాలి. అందులో వచ్చిన మార్కులను విధిగా అన్ని సందర్భాల్లోనూ పరిగణనలోకి తీసుకోవాలి. |
|
7. ప్రతి అయిదేళ్లకోసారి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలి. |